Saturday , October 12 2024

పరిగి:గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలను నమ్మలేక

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి 5

పరిగిమాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన 100 మంది కాంగ్రెస్ బిజెపి పార్టీల నాయకులు.. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కకి అండగా అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. మా పార్టీలో ఉంటూ మాకు నిజయిగా పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు మాకు ముఖ్యమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్ని మోసపూరిత హామీలు ఇచ్చిండ్రు ఆ హామీలు ఎన్ని నెరవేర్చిండ్రు ప్రజలు గమనిస్తున్నారు.గత ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలిచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, ఇందులో ఏవీ అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చేయకపోగా, ధాన్యం సరిగ్గా కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. మహిళలకు రూ.2500 ఇస్తామన్నారని, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ అని చెప్పి ఏదీ అమలు చేయడం లేదని అరచేతిలో వైకుంఠం చూపించి, అడ్డోగులు వాగ్ధానాలు చేసి ప్రజలను దారుణంగా మోసం చేసింది కాంగ్రెస్‌ పార్టీ. మీ అందరికి తెలుసు ఎలాంటి వాగ్ధానాలు చేసిండ్రు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చరా అని ప్రజలను . కేసీఆర్‌ ఎకరానికి రూ.10 వేలు ఇస్తుండుగా మేం రూ.15 వేలు ఇస్తం అన్నరు. కేసీఆర్‌ కళ్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలే ఇస్తున్నడు మేం ఆ లక్షతోపాటు తులం బంగారం ఇస్తం అన్నారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తం అన్నరు. కేసీఆర్‌ కేవలం లక్ష రూపాయలే రుణ మాఫీ చేసిండు, మేం రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తం అన్నారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్న ఫ్రీ బస్సు తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చని దౌర్భాగ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని ఆయన అన్నారు…