Thursday , May 23 2024

శాంతి యుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలి

మండలంలో 70 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు

సీఐ బిల్ల కోటేశ్వర్

తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి మే 13

చిగురుమామిడి మండల శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని చిగురు మామిడి మండలం ఎన్నికల బందోబస్తు ఇంచార్జ్ బిల్ల కోటేశ్వరరావు తెలిపారు మండలంలోని 17 గ్రామాలలో 40 పోలింగ్ బూతులను స్థానిక ఎస్సై బండి రాజేష్ తో కలిసి పరిశీలించారు పోలీస్ సిబ్బందికి రేపు జరిగే పోలింగ్ కై పలు సూచనలు చేశారు అనంతరం సీఐ మాట్లాడుతూ మండలంలో 70 మంది పోలీస్ సిబ్బందితో ప్రతిష్ట బందోబస్తు పోలింగ్ బూత్లలో ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నికల కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని, ఓటు హక్కు కలిగిన ప్రతి వారు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల నియమావళి దృష్ట్యా 144 సెక్షన్ అమలులో ఉన్నందున పోలింగ్ స్టేషన్ వద్ద గుమ్మి కూడి ఉండరాదని అన్నారు. గ్రామాల్లో గుంపులు గుంపులుగా తిరగరాదని, నిబంధనలు ఎవరు అతిక్రమించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అన్నారు. ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో మద్యం,డబ్బులు పంపిణీ చేపడితే, పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.