Thursday , May 23 2024

మాసాయిపేట వద్ద 88.43 లక్షలు పట్టివేత.

తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి మే 13:

మెదక్ జిల్లా మాసాయిపేట్ పోతనపల్లి చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేయగా రెండు వాహనాలలో డబ్బు తరలిస్తున్నట్టు తనిఖీ చేసి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద శివన్నూరు వద్ద ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ నుంచి వాహనాలలో తరలించారు.బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డి కి చెందిన డబ్బుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బూతు లెవల్లో 27 ప్యాకెట్లడబ్బు పంపిణీ చేయాలని డబ్బు తరలిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై చేగుంట పట్టణానికి చెందిన కుల్ల బోయిన రవి, అన్నం రవి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు రామయంపేట్ సిఐ వెంకటేష్ రెండు కార్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.