.. మరిపెడ తెలంగాణ కెరటం ప్రతినిధి 26న్యూస్.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని సెంట్ ఆగస్టీన్ హై స్కూల్లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ఆదేశం అనుసారం సి సి ఎస్ సిఐ గండ్రతి మోహన్ ఆధ్వర్యంలో ఐదవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో భాగంగా ఏ హెచ్ టి యు, షీ టీం మరియు భరోసా సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానవ అక్రమ రవాణా, ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, క్యూఆర్ కోడ్ పిడిషన్ మరియు సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మరియు ఫోక్ చట్టాల గురించి బాల్యవివాహాల గురించి విద్యార్థులకు అవగాహన సదస్సు కల్పించడం జరిగిందని సీఐ మోహన్ తెలియజేశారు. విద్యార్థులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురికా వద్దన్నారు. ఎవరైనా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే 100కు లేదా 1098 కు డయల్ చేయాలని సూచించారు. ఎవరైనా విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తే వారికి చట్టపరమైన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా విద్యార్థునులు జాగ్రత్తగా ఉండాలని బయట వ్యక్తులు ఎవరైనా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే తమ తల్లిదండ్రులకు, పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ ఈ కార్యక్రమంలో షీ టీం ఏ హెచ్ టి యు కానిస్టేబుల్ ఊర్మిళ విద్యార్థునులకు అవగాహన కల్పించడం జరిగింది. ఎవరైనా పాఠశాల ఆవరణలో గాని తమ ఇంటి దగ్గర గాని అసభ్యంగా ప్రవర్తించినప్పుడు 1000 98 కి 1081 డయల్ చేయాలని సూచించారు ఎవరైనా తమపై వచ్చినప్పుడు గట్టిగా అరిచి పక్కవాళ్ల సహాయం తీసుకోవాలని, తమ తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. భరోసా టీం జోష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పుడు ధైర్యంగా ఉండాలని ఎవరైనా అసభ్యంగా గాని చెడు మాట్లాడడం గాని చేస్తే వెంటనే మీ తల్లిదండ్రులతో చెప్పి లేదా తమ దగ్గర ఉన్న సెల్ ఫోన్ల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. షీ టీం కానిస్టేబుల్ అరుణ మాట్లాడుతూ విద్యార్థులు ఎవరితో కూడా స్కూల్ ఆవరణలో బయట వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు బయట నుండి వచ్చే వ్యక్తులు ఏమైనా తినుబండారాలు ఇచ్చిన తీసుకోవద్దని సూచించారు విద్యార్థులు ఇంటి నుండి పాఠశాల వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చైల్డ్ లైన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ డాక్టర్ నాగమణి విద్యార్థులపై జరిగే ఆగత్యాలను గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. నాగమణి మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయులకు తగు సూచనలను వివరించి విద్యార్థుల పట్ల జరుగుతున్న అఘత్యాలను అరికట్టాలని సూచించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించి సహకరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మరల సెంట్ అగస్టిన్ హైస్కూల్లో ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని హై స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ రోషిని జోష్నకు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని తోటి స్నేహితులకు గాని, తమ మహిళా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. పాఠశాలలో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు 1098 కు డయల్ చేయాలని సూచించారు. విద్యార్థులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని తెలియజేశారు. స్కూల్లో ఎవరైనా ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు మీ యొక్క తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపాల్ కు వెంటనే తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. స్కూల్లో జరిగిన దానిపై కీచక ఉపాధ్యాయులకు డ్రైవర్ ప్యూన్ లను విచారించి కఠినంగా శిక్షలు పడేలా చూస్తామని తెలియజేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు తమ నివేదిక అందజేస్తాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ రోషిని, షీ టీం ఏఎస్ఐ హనుమకొండ ఆనందం కానిస్టేబుల్ రమేష్, పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన షీ టీం పోలీసులు…
మరిపెడ తెలంగాణ కెరటం ప్రతినిధి 26న్యూస్..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని సెంట్ ఆగస్టీన్ హై స్కూల్లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ఆదేశం అనుసారం సి సి ఎస్ సిఐ గండ్రతి మోహన్ ఆధ్వర్యంలో ఐదవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో భాగంగా ఏ హెచ్ టి యు, షీ టీం మరియు భరోసా సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానవ అక్రమ రవాణా, ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, క్యూఆర్ కోడ్ పిడిషన్ మరియు సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మరియు ఫోక్ చట్టాల గురించి బాల్యవివాహాల గురించి విద్యార్థులకు అవగాహన సదస్సు కల్పించడం జరిగిందని సీఐ మోహన్ తెలియజేశారు. విద్యార్థులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురికా వద్దన్నారు. ఎవరైనా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే 100కు లేదా 1098 కు డయల్ చేయాలని సూచించారు. ఎవరైనా విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తే వారికి చట్టపరమైన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా విద్యార్థునులు జాగ్రత్తగా ఉండాలని బయట వ్యక్తులు ఎవరైనా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే తమ తల్లిదండ్రులకు, పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ ఈ కార్యక్రమంలో షీ టీం ఏ హెచ్ టి యు కానిస్టేబుల్ ఊర్మిళ విద్యార్థునులకు అవగాహన కల్పించడం జరిగింది. ఎవరైనా పాఠశాల ఆవరణలో గాని తమ ఇంటి దగ్గర గాని అసభ్యంగా ప్రవర్తించినప్పుడు 1000 98 కి 1081 డయల్ చేయాలని సూచించారు ఎవరైనా తమపై వచ్చినప్పుడు గట్టిగా అరిచి పక్కవాళ్ల సహాయం తీసుకోవాలని, తమ తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. భరోసా టీం జోష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పుడు ధైర్యంగా ఉండాలని ఎవరైనా అసభ్యంగా గాని చెడు మాట్లాడడం గాని చేస్తే వెంటనే మీ తల్లిదండ్రులతో చెప్పి లేదా తమ దగ్గర ఉన్న సెల్ ఫోన్ల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. షీ టీం కానిస్టేబుల్ అరుణ మాట్లాడుతూ విద్యార్థులు ఎవరితో కూడా స్కూల్ ఆవరణలో బయట వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు బయట నుండి వచ్చే వ్యక్తులు ఏమైనా తినుబండారాలు ఇచ్చిన తీసుకోవద్దని సూచించారు విద్యార్థులు ఇంటి నుండి పాఠశాల వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
చైల్డ్ లైన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ డాక్టర్ నాగమణి విద్యార్థులపై జరిగే ఆగత్యాలను గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. నాగమణి మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయులకు తగు సూచనలను వివరించి విద్యార్థుల పట్ల జరుగుతున్న అఘత్యాలను అరికట్టాలని సూచించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించి సహకరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మరల సెంట్ అగస్టిన్ హైస్కూల్లో ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని హై స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ రోషిని జోష్నకు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని తోటి స్నేహితులకు గాని, తమ మహిళా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. పాఠశాలలో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు 1098 కు డయల్ చేయాలని సూచించారు. విద్యార్థులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని తెలియజేశారు. స్కూల్లో ఎవరైనా ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు మీ యొక్క తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపాల్ కు వెంటనే తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. స్కూల్లో జరిగిన దానిపై కీచక ఉపాధ్యాయులకు డ్రైవర్ ప్యూన్ లను విచారించి కఠినంగా శిక్షలు పడేలా చూస్తామని తెలియజేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు తమ నివేదిక అందజేస్తాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ రోషిని, షీ టీం ఏఎస్ఐ హనుమకొండ ఆనందం కానిస్టేబుల్ రమేష్, పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
16,417 comments