Thursday , May 23 2024

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా లోక్ సభ ఎన్నికలకు కట్టుదిడ్డమైన భద్రత.

మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మే 13:

శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి 1309 మంది జిల్లా,రాష్ట్ర మరియు కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు.
క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి భయం,వత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
జిల్లా ఎస్పీ డాక్టర్.బాలస్వామి
మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్. బాలస్వామి మెదక్ జిల్లా బాయ్స్ జీనియర్ కాలేజీ మరియు నర్సాపూర్ బి వి ఆర్ ఐ టి కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను సందర్శించి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్.బాలస్వామి మాట్లాడుతూ 13వ తేది జరిగబోయే పార్లమెంట్ ఎన్నికలకు చేపట్టిన భద్రతా చర్యలను ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేయడం జరుగుతుందని జిల్లా జిల్లా ఎస్పీ డాక్టర్. బాలస్వామి తెలిపారు. తద్వారా జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తున్నాం. శాంతియుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో 1309 మంది జిల్లా, రాష్ట్ర (టి ఎస్ ఎస్ పి , శిక్షణ కానిస్టేబుళ్లు,) కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ,ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు, 78 రూట్ మొబైల్స్, 21 క్విక్ రియాక్షన్ టీమ్స్ (ఇందులో అప్పటినుంచి (క్యూ ఆర్ టి)/ స్ట్రయికింగ్ ఫోర్స్/ స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్/ అబ్జర్వేషన్ టీమ్స్ లతో పకడ్బందీ గ భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు.
జిల్లా లోని పోలింగ్ కేంద్రాల వివరాలు:జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషన్ లు 770, లొకేషన్స్ 530, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు. 127
స్వాధీన పరుచుకున్న వివరాలు :
ఇప్పటివరకు స్వాధీనపరచుకున్న నగదు 1,45,94,194 /- రూపాయలు.
లిక్కర్ 3322.555 లీటర్లు, సుమారుగా అంచనా విలువ 14,47,516 రూపాయలు
ఇతర సామాగ్రి: ఫ్రీ బీజ్ సుమారుగా అంచన విలువ 42,87,500 రూపాయలు.
జిల్లాలో ఇప్పటివరకు బైండోవర్ చేయబడిన వ్యక్తులు 241. గతంలో ఎలక్ట్రోరల్ నేరాలకు పాల్పడ్డ వ్యక్తులను మరియు అందులో సహకరించిన వ్యక్తులను బైండోవర్ చేయడమైనదని, రౌడీ షీట్ కలిగిన వారిని కూడా ముందస్తుగా బైండోవర్ చేయడం జరిగింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనాలపై కఠినంగా ఉన్నామన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు జిలాల్లో ఎన్నికల నియామావళి ఉల్లంఘన కేసులు 06 నమోదు కావడం జరిగిందని అన్నారు.
లైసెన్సుడు ఆయుధముల డిపాజిట్: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియామవళి అనుసారంగా లైసెన్సు కలిగిన ఆయుధములు అన్ని డిపాజిట్ కొరకు అండర్ సెక్షన్ 144 Cr.pc అనుసరించి నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది.
జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి భయం, వత్తిడి లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, అందుకు సంబందించి ప్రజలకు సురక్షితమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగినదని ఓటు ఉన్న అందరు ఓటు వేయాలని జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారు కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి భయం లేకుండా ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ .బాలస్వామి ఈ సందర్భంగా కోరారు.