తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి మే 13:
పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని *జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ * ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి ఈవీఎం బాక్సులు, పోలింగ్ సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమయంలో సాయుధ పోలీస్ బలగాలతో ఎస్కార్ట్ తో వెళ్లడం జరుగుతుందని పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1300 మంది పోలీసు అధికారులు సిబ్బందితో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు స్వేచ్ఛగా, ధైర్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. ముఖ్యంగా సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిధిలో మూడు నియోజకవర్గాలను 62 రూట్లుగా విభజించి 553 పోలింగ్ కేంద్రాలలో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 6 గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద సంసిద్ధంగా ఉంటారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎక్కడ సమస్యలు ఉన్న వెంటనే పోలీస్ వారు అక్కడికి చేరుకొని సమస్య పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు సోషల్ మీడియా పై పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే సి-విజిల్ యాప్ నుండి కంప్లైంట్ చేయాలని ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎలక్షన్ కోడ్ మొదలు ఇప్పటివరకు 1,48,96,300/- రూపాయలు సీజ్ చేసి గ్రివియస్ కమిటీకి పంపించడం జరిగిందని, 3302.565 లిక్కర్ వాటి విలువ 17,18,036 రూ విలువ గల లిక్కర్ సీజ్ చేయడం జరిగిందని, గోల్డ్ 539.930 గ్రముల బంగారం వాటి విలువ 17,00,000/- ఉంటుందని, 427 గ్రాముల వెండి వాటి విలువ 31,000/- సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.4051 దుస్తులు వాటి విలువ 2,32,500/- రూపాయల విలువ గల దుస్తులు సీజ్ చేయడం జరిగిందని, ముందస్తు 785 మంది వ్యక్తులను బైండోవర్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. జిల్లా పరిధిలో ప్రజలు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు జిల్లా ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని ఎస్పీ కోరారు.