Saturday , October 5 2024

ప్రజలు ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు

(తెలంగాణ కెరటం) ఘట్ కేసర్ ప్రతినిధి / మే 5 : త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా, వారిలో ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ఘట్ కేసర్ పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదులాబాదు మరియు ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో సమస్యాత్మకమైన ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కుని స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ప్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని, ఘట్కేసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో ఎస్సైలు రాము నాయక్, శేఖర్, శ్రీకాంత్ పోలీసు బలగాలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.