Wednesday , September 18 2024

ఇందుప్రియల్ గ్రామంలో గడపగడపకు తిరుగుతూ వెంకట్రాంరెడ్డి కి ఓటు వేసి గెలిపించాలి

దౌల్తాబాద్ జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ కెరటం:రాయపోల్ /దౌల్తాబాద్ :మే 4
దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ బి ఆర్ ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి గెలుపు కోసం ఇందుప్రియల్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సిద్దిపేట కలెక్టర్ గా వెంకటరామిరెడ్డి చాలా అభివృద్ధి పనులు జరిగాయని. ఈరోజు ఎండాకాలంలో చెరువులు నిండుతున్నాయంటే కేసీఆర్, హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మన వెంకటరామిరెడ్డి వలన పనులే ఈరోజు ఆదర్శంగా కనబడుతున్నాయి. రైతులు కూడా యాసంగి పంట పండింది అంటే అది వీళ్ళ కృషి ఫలితమే అని చెబుతున్నారు. ప్రతి ఇంటికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి ఓటు వేయాలని చెప్పడంతో వాళ్లే మాకు కేసీఆర్ ప్రభుత్వము ఉన్నప్పుడు రైతుబంధు, కల్యాణ లక్ష్మి ఇంటింటికి నల్ల రావడం కానీ 24 గంటలు కరెంటు గానీ మాకు వస్తుండే ఇప్పుడు అన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థి వెంకట్రాంరెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తము అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం ప్రెసిడెంట్ దేవేందర్, ఎంపీటీసీ మల్లేశం, గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షులు వేంపల్లి శ్రీనివాస్, నాయకులు తదితరులు ఉన్నారు.