Saturday , May 18 2024
Breaking News

కమ్యూనిస్టులు బలపరిచిన అభ్యర్థి నీలం మధుని గెలిపించాలి…సీపీఎం

తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి మే 4

కేంద్రంలోని మతోన్మాద బిజెపిని ఓడించి, లౌకిక శక్తుల ఐక్యతను చాటుతూ ఏర్పాటైన ఇండియా కూటమి మెదక్ నియోజకవర్గ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని లు ప్రజలను కోరారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం పి ఎస్ ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంకు మెదక్, నర్సాపూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు బయలుదేరు వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం, జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి నాగరాజు మాట్లాడుతూ గత పది సంవత్సరాల బీజేపీ పాలన లో దేశం,వంద సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని,పాలన చేతకాక ప్రభుత్వరంగ సంస్థల ను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు దారా దత్తం చేసిందని, అంబానీ ఆదానీలను అపర కుబేరులుగా మార్చి వారి కి ఊడిగం చేయడానికి కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పనిచేసిందని వారన్నారు. లౌకికదేశంలో మత రాజకీయాలు చేస్తూ, మతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చులు పెడుతుందని, దేవుని పేరు చెప్పి ఓట్లను అడుక్కోవడం తప్ప దేశ ప్రజలకు చేసింది ఏందో చెప్పాలని వారన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ నిఘా సంస్థలను గుప్పెట్లో పెట్టుకొని దేశంలోనే ప్రతిపక్ష పార్టీలపై, ప్రభుత్వాలపై ఇబ్బందులకు గురి చేస్తుందని వారు అన్నారు. ఎంతటి అవినీతిపరులైనా బిజెపి కండువా కప్పుకుంటే పునీతులైపోతున్నారని, 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో మారిన ప్రభుత్వాలు అన్ని చేసిన అప్పులకంటే 10సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పు 3రేట్లు అధికమని వారన్నారు. రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగ నిర్మాణం చేయడానికి కుట్రలు చేస్తుందని, బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తామని బిజెపి బహిరంగంగా పలుకుతుందని ఇటువంటి మతోన్మాద శక్తులను, తరిమికొట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని వారన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, లౌకిక శక్తుల ఐక్యతకు దేశవ్యాప్తంగా ఏర్పడిన రాజకీయ పార్టీల ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, దేశవ్యాప్తంగా పిలుపునిచ్చాయని, కూటమిలో భాగంగా జిల్లా లో కమ్యూనిస్టులు బలపరిచిన మెదక్ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకి సిపిఎం జిల్లా కమిటీ మద్దతు తెలియజేస్తుందని, లౌకిక శక్తులు, మేధావులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు మతతత్వ బిజెపి పార్టీ, ఆ పార్టీని అంటిపెట్టుకొని అంటగాగుతున్న టిఆర్ఎస్ లను ఓడించాలని నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. నీలం మధు గెలుపును కాంక్షిస్తూ జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తామని, పార్టీ శాఖలను, శ్రేణులను, కమ్యూనిస్టు సానుభూతిపరులను కలిసి కూటమి అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామని, ప్రజలను చైతన్య పరచడంలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు స్వతంత్రంగా నైనా ప్రజల్లో కి వెళ్లి బిజెపి దాని అనుబంధ పార్టీల వైఫల్యాలను వైఫల్యాలకు వివరిస్తూ నీలం మధు గెలుపుకు పాటుపడతామని వారు సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, బస్వరాజు, మహేందర్ రెడ్డి, దాసు, గౌరయ్యా, గీత, సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.