Monday , September 16 2024

పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న రజక అభ్యర్థులను గెలిపించాలి.

  • తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి

మేడ్చల్ మల్కాజిగిరి, జవహర్ నగర్ / మే 6 (తెలంగాణ కెరటం)

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అంబేద్కర్ నగర్ లో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు సాంబరాజు కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలిపాక లక్ష్మణ్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థి నడిమింటి శ్రీనివాస్ హర్మోనియం గుర్తుతో, భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి బీఎస్పీ పార్టీ అభ్యర్థి అయితరాజు అభయంధర్ ఏనుగు గుర్తుతో ఖమ్మం పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థి ఉల్లెంగల యాదగిరి రోడ్డు రోలర్ గుర్తు నుంచి పోటీ చేస్తున్న వారిని ఆయా పార్లమెంట్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓటర్లు వారికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి లోక్ సభకు పంపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గొంతుకలుగా మన హక్కులకై, సంక్షేమ పథకాలకై,రాజకీయ వాటకై ,మన చట్టాలను తయారు చేసుకునే అవకాశం వారికి ఇవ్వాలని కోరారు. రజకుల సత్తా ఏంటో ఓటు ద్వారా తెలియజేసి మన అభ్యర్థులను గెలిపించి ఐక్యతను చాటాలని వారన్నారు. సమావేశంలో రాష్ట్ర యూత్ కార్యదర్శి కొండ్రాతి రమేష్,రాష్ట్ర యూత్ మీడియా సెక్రటరీ రాపర్తి అజయ్, జిల్లా యూత్ అధ్యక్షులు అర్రొల్ల కన్నయ్య,అలుగునూరి సుభాష్, అలుగునూరి శోభన్ తదితరులు పాల్గొన్నారు.