Sunday , May 19 2024
Breaking News

జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి కి సన్మానం

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 5:

బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీ లో చేరగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలియాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలియాస్ మాట్లాడుతూ పార్టీకోసం కష్టపడి పనిచేసే వారికి ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందన్నారు పార్టీ నాయకులతో మాట్లాడుతూ కొత్త పాత అని లేకుండా అందరిని కలుపుకొని రాబోయే జహీరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లలో భారీ మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, మోహన్ రెడ్డి, రాజిరెడ్డి, భాస్కర్ రెడ్డి, రొడ్డ రాజు, బాబూ, శ్రీకాంత్ రెడ్డి, స్వామి, రంజిత్ కుమార్, మహేశ్, దయానంద్ గౌడ్, లింగం, దుర్గా గౌడ్ తదితరులు పాల్గొన్నారు