Saturday , May 18 2024
Breaking News

ఇంస్టాగ్రామ్ ఫేక్ ఐడి క్రియేట్ చేసి అమ్మాయిని వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు…

జమ్మికుంట మే 4; తెలంగాణ కెరటం ప్రతినిధి

ఇంస్టాగ్రామ్ ఫేక్ ఐడి క్రియేట్ చేసి అమ్మాయిని వేధిస్తున్న వ్యక్తిపై జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట పట్టణానికి చెందిన అమ్మాయి తన ఇంటర్ బ్యాచ్ మెంట్ అయిన హనుమకొండకు చెందిన సుమంత్ అనే వ్యక్తి ఫిర్యాదురాలు అయిన అమ్మాయి యొక్క ఇంస్టాగ్రామ్ ఐడి ని ఫేక్ ఐడి గా క్రియేట్ చేసి తన గురించి అసభ్యకరంగా అవమానపడేలా అమ్మాయి వాళ్ళ అన్నయ్యకు ఇంస్టాగ్రామ్ లో మేసేజ్ చేస్తు ఫిర్యాదురాలను వేధిస్తున్నాడని ఫిర్యాదురాలు దరఖాస్తు ఇవ్వగా జమ్మికుంట సీఐ వరగoటి రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.