తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి జనవరి
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామనికి చెందిన బొమ్మని బుచ్చయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతూ మంగళవారం మధ్యాహ్నం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి,బుధవారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తక్షణ సహాయంగా 10 వేల రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జాలని బాల్ నర్సయ్య,బొమ్మని సత్తయ్య,కృష్ణ,శ్యామ్ సుందర్,తదితరులు ఉన్నారు.