•పెద్దగొట్టిముక్కలలో సాయికుమార్ పలు కార్యక్రమలు నిర్వహణ
తెలంగాణ కెరటం శివ్వంపేట మండల ప్రతినిధి మార్చ్ 3:-స్థానిక జడ్పీటీసీ మహేష్ గుప్తా స్ఫూర్తితో శివంపేట మండలం పెద్ద గొట్టుముల గ్రామానికి చెందిన భేరి సాయికుమార్ గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ నిర్వహిస్తున్న అన్యువల్ డే సెలబ్రేషన్స్ కి తన వంతు సాయంగా డీజే పెట్టించడం మరియు వచ్చే సంవత్సరం 10వ తరగతిలో మొదటిగా స్థానంలోలో నిలిచినా విద్యార్థికి 2వేల రూపాయలు, అలాగే రెండవ స్థానంలో నిలిచినా విద్యార్థికి వెయ్యి రూపాయల నగదు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నవీన్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు ఆంజనేయులు,రామచంద్రన్ గౌడ్,యువకులు నాగరాజు, గణేష్, కృష్ణ, పోచయ్య మరియు స్కూల్ హెచ్ఎం రాజుగారు ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొనడం జరిగింది.