Friday , October 4 2024

జెడ్పీ ఫ్లోర్ లీడర్ గా గీకురు రవీందర్ నియామకం

తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి జనవరి 01

కరీంనగర్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా చిగురుమామిడి జెడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ ను డిసిసి అధ్యక్షులు, మానకొండుర్ శాసన సభ్యులు కవ్వంపెల్లి సత్యనారాయణ నియామకం చేశారు. ఫ్లోర్ లీడర్ గా ఎంపికైన సందర్భంగా జడ్పీటిసి సభ్యులు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా పని చేస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు చేరువగా, ప్రజా పాలన చేపట్టడం హర్షణీయమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఆరు గ్యారంటీ హామీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రజలకు చేరెందుకు కృషిచేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తానన్నారు. తన ఎంపికకు సహకరించిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కు జిల్లా అధ్యక్షులు కవ్వంపెల్లి సత్యనారాయణ కి, వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డితో పాటు డిసిసి కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.