Monday , September 16 2024

విధినిర్వహణలో తాడ్వాయి హెడ్ కానిస్టేబుల్ మృతి

తెలంగాణ కెరటం 28. ఏప్రిల్
తాడ్వాయి, ఎల్లారెడ్డి, ప్రతినిధి

రోడ్డు ప్రమాదం లో హెడ్ కానిస్టేబుల్ మృతి
తాడ్వాయి పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ తాళ్ల పల్లి శ్రీనివాస్ గౌడ్ తండ్రి బాగాగౌడ్ వయస్సు 50 కులం గౌడ్స్ వినాయక నగర్ కామారెడ్డి విధి నిర్వహణలో భాగంగా కామారెడ్డి నుండి రాత్రి అందాజ 11:45 గంటలకు తన కారు నంబరు AP 25 AL 1557 సాంట్రో నందు నడుపుకుంటూ తాడ్వాయి పీఎస్ కు బయలుదేరి వస్తుండగా రాత్రి అందాల ఒంటిగంట సమయంలో తాడ్వాయి శివారులో కెనాల్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీ తో యాక్సిడెంట్ అయ్యి తీవ్ర గాయాలయి ఉండగా 108 అంబులెన్స్ ద్వారా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రాగా డ్యూటీ డాక్టర్ సలహా మేరకు మెరుగైన చికిత్స గురించి ప్రైవేట్ అంబులెన్సు ద్వారా హైదరాబాద్ కు తీసుకొని వెళుచుండగా మార్గమధ్యలో మేడ్చల్ వద్ద వెళ్ళగానే చనిపోవుగా తిరిగి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురి నందు ఉంచనైనది లారీ గురించి తెలుసుకోనుగా గ్రానైటర్ లోడు లారీ నంబరు TS 12 UB 8495 గల దాని డ్రైవరు లారీనితాడ్వాయి గ్రామ శివారు కాలువ వద్ద రోడ్డుపై ఎలాంటి జాగ్రత్త తీసుకోకుండా నిర్లక్ష్యంగా పార్కింగ్ లైట్లు వేయకుండా నిలిపి ఉంచడం వలన అదే మార్గంలో వెళ్తున్న కారు లారీ వెనుక భాగంలో ఢీకొట్టడం వలన తలకు చాతిపై మరియు ఇతర చోట్ల బలమైన రక్త గాయాలు అయి చనిపోయినాడు ఇటి ప్రమాదం జరిగినప్పుడు మధ్య రాత్రి అనగా 12:30 గంటలు అయినదని తాడ్వాయి ఏ ఎస్ ఐ శ్రీ సంజీవ్ కేసు నమోదు చేయనైనది