Thursday , May 23 2024

ఎద్దు పొడిచి మహిళ మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి
జూన్:-18

రాజన్న సిరిసిల్ల జిల్లా
రుద్రంగి మండలకేంద్రంలో దేవుళ్ళ పేరుతో కొందరు భక్తులు ఆవులను వదిలిపెట్టి వెళ్తూ ఉంటారు.దాదాపు ఒక పది ఆవులు ఎద్దులు గ్రామంలో తిరుగుతూ ఉంటాయి,రెండు రోజుల క్రితం రుద్రంగి గ్రామానికి చెందిన అంజవ్వ (63)అనే మహిళను ఎద్దు పొడవడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది మృతురాలికి కుమారుడు ఇద్దరు కూతుళ్లు
ఉన్నారు మృతదేహంతో
ఆమె బంధువులు కుల సంఘ సభ్యులు ఇందిరా చౌక్ లో దర్నా నిర్వహించారు ప్రభుత్వ పరంగా ఆదుకోవలని కోరారు ఇంత పెద్ద సంఘటన జరిగిన ప్రజాప్రతినిధులు ఎవ్వరుకూడా రాలేదని మృతురాలి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామం లో తిరిగే ఎద్దులను ఆవులను సంరక్షించే బాధ్యత గ్రామపంచాయతీ తీసుకోవాలని అన్నారు సంఘటన స్థలానికి రుద్రంగి ఎస్ ఐ ప్రభాకర్ తన సిబ్బంది తో చేరుకొని బాధితులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.