Thursday , May 23 2024

మాదిగలను విస్మరించిన కాంగ్రెస్ ను ఓడించి తీరుతాం

కాళ్ల పాండు ఎమ్మెస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ బోడ ముత్యాలు భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కన్వీనర్

తెలంగాణ కెరటం, యాచారం, ఏప్రిల్ 19

పార్లమెంట్ స్థానాలల్లో మాదిగలకు ఒక్కసీటు కేటాయించక పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వర్గీకరణ చేస్తామన్నా బిజెపి కి మా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాము.శనివారం యాచారం మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ప్రచార కమిటీ కో కన్వీనర్ పంది సతీష్ మాదిగ,వీహెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాళ్ళజంగయ్యమాదిగ,భోనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కమిటీ సభ్యులు కాళ్ళ జంగయ్య, మూలి మహేష్ ,కందుకూరి కొండల్ సమావేశం అనంతరం యాచారం మండల్ ప్రచార కమిటీ నూతనంగా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. కన్వీనర్ సిద్దాపురం శ్రీకాంత్, కో కన్వీనర్లు మస్కు మహేష్, కన్వీనర్ మహమ్మద్ సలీం కమిటీ సభ్యులుగా కందికంటి అజయ్, జైతారం వినోద్,కందికంటి ఆనంద్,యంజాల జంగయ్య ఈ కమిటీని ఎమ్మెస్పీ నియోజకవర్గ ఇన్చార్జి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాలు ప్రకటించడం జరిగింది.