Thursday , May 23 2024

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

తెలంగాణ కెరటం, యాచారం, మార్చ్ 3
ప్రతినిధి మార్చి 03

యాచార మండల పరిధిలోని నంది వనపర్తి గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం లో పోలియో చుక్కలు వేయడం ప్రారంభించారు.అనంతరం గ్రామ సెక్రెటరీ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన పిల్లలనుండి ఐదేళ్ల లోపు చిన్నారుల‌కు తప్పనిసరిగా పోలియో చుక్క‌లు వేయించాలన్నారు. మూడు రోజుల పాటు ఐదేండ్ల‌ లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు కార్యాచరణ రూపొందించారని అన్నారు.పిల్లల భవిష్యత్ ఆరోగ్యానికి రెండు పోలియో చుక్కలు 0-5 సంవత్సరాల పిల్లలకు తప్పక వేయించండి.పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ శ్యాంసుందర్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ విజయ, ఏఎన్ఎం రమణ, అంగన్వాడి టీచర్స్ సువర్ణ, అండాలు, సుజాత, వసంత, ఆశా వర్కర్స్, సైదమ్మ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.