Thursday , May 23 2024

ఉపాధి హామీచట్టానికి నిధులు పెంచి గతంలో వున్న అవకాశాలు కల్పించాలి

వ్యకస జిల్లా అధ్యక్షులు పి. అంజయ్య

తెలంగాణ కెరటం, యాచారం, ఫిబ్రవరి 28

బుధవారం మాల్ గ్రామంలో ఉపాధి కూలీలు పని చేస్తున్న దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసు కోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పి అంజయ్య మట్లాడుతూ,బిజెపి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి నిధులు భారిగా తగ్గించింది. కూలీలకు డబ్బులు సకాలంలో రక ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి హామీ పథకంలో అనేక మార్పులు తెచ్చి కూలీలకు ఉపాధిని దూరం చేసే కుట్రలు చేస్తున్నది బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి నిదులు పెంచి. పకడ్బందీగా అమలు చేయాలి.పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు నీడ, నీళ్లు,మేడికల్ కిట్టు అందు బాటులో వుండాలి.కొలతలు లేకుండ రోజు కులీ 600 రూ చెల్లించాలి.సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి
పెస్లిప్పులు ఈవ్వడం లేదు వెంటనే ఇయ్యలీ.పనిముట్లు
గడ్డపారలు 7 సంవత్సరాల క్రితం కొంత మందికే ఇచ్చారు . ఇప్పుడు కులిలందరికి గడ్డ పార, పార, తట్ట వెంటనే ఈయ్యాలి. కూలీలకు వాటర్ సప్లయ్ చేయాలి.లేద కూలీలు తెచ్చుకున్న వాటర్ కు డబ్భులు చెల్లించాలి.గడ్డ పార మొన డబ్బులు గతంలో ఇచ్చి ఇప్పుడు ఇవ్వడం లేదు కాబట్టి కూలీల మీదా అదనపు భారం పడ్తుంది కావున మొన డబ్బులు చెల్లించాలి
ప్రయాణ ఛార్జీలు గతంలో ఇచ్చి ఇప్పుడు ఇవ్వడం లేదు కాబట్టి వెంటనే చెల్లించాలి. పని కావాలని ధరకాస్తు చేసు కున్న వారందరికీ పని కల్పించాలి ధరకాస్తు చేశాక పని కల్పించక పొతే నిరుద్యోగ భృతి చెల్లించాలి
ప్రతి వారవారం కులీ డబ్బులు చెల్లించాలి
తీవ్రమైన ఎండలు వున్నందున ఉదయం పూటమాత్రమె పనికల్పించాలి.ఫోటో క్యాప్చర్ తీసి వేయాలి
గ్రూపులు పెట్టీ మెట్లను నియమించాలి
పని వేగవంతం చేసి కులీలందరికి పని కల్పించాలి .
ఇప్పుడే పని ప్రారంభం ఇతుంది కాబట్టి పైనా పేర్కొన్న అన్ని సమస్యలు పరిష్కరించాలనీ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము
ఈ కార్యక్రమంలో ఏఐఏ డబ్ల్యూ యు మండల నాయకులు బి.ఇందిరమ్మ,యాదమ్మ, ఎట్టమ్మ, జంగమ్మ,యాదమ్మ,ఈశ్వరమ్మ,కమలమ్మ, అండాలు,రాములు, రోశయ్య, లలిత, రమణ తదితరులు పాల్గొన్నాను.