Wednesday , September 18 2024

కాంగ్రెస్‌ పార్టీని బొందపెడతాం

కేటీఆర్‌

తెలంగాణ కెరటం,ఇబ్రహీంపట్నం,ఫిబ్రవరి27

కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. వంద రోజులు ఓపిక పడతామనిమార్చి 17 వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్‌ పార్టీని బొందపెడతామని స్పష్టం చేశారు. మంగళవారం నిర్వహించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్‌ కార్యకర్తల విస్తృత స్థాయి జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ప్రజలు బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చారని అన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి పట్టం కట్టారని తెలిపారు.జిల్లాల్లో ఉండే ప్రజలను 420 హామీలతో మోసం చేసి కాంగ్రెస్‌ నేతలు గద్దెనెక్కారు అని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులయ్యిందని.. అప్పుడే కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యాయని విమర్శించారు. రైతులకు రైతు బంధు పడలేదని.. ఫ్రీ బస్ వల్ల అడబిడ్డలు కొట్టుకునే పరిస్థితి వచ్చిందని.. ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్లు ఆగమైనరని అన్నారు. నోటికొచ్చిన మాటలు అమలుకాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇంకా చేయలేదని మండిపడ్డారు. కోటి 57 లక్షల మహిళలు మహాలక్ష్మి పథకం ఎప్పుడు వస్తుందని చూస్తున్నారని.. తాము కూడా 100 రోజులు ఓపిక పడతామని డెడ్‌లైన్‌ చెప్పారు. మార్చి 17 వరకు హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని బొందపెడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి ,కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేష్ ,మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, వంగేటి లక్ష్మారెడ్డి, యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఒంగేటి లక్ష్మారెడ్డి ,బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.