Saturday , October 12 2024

పరిష్కారం ఎక్కడ ఎంపిడిఓ ?గుండాల లో పడకేసిన పారిశుధ్యంపట్టించుకోని అధికారులు

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి 20:

దోమ మండల పరిధిలోని గుండాల గ్రామ పంచాయతీ పరిధిలో గత కొన్ని రోజులుగా అండర్ గ్రౌండ్ నాలుగో వాడలో నేటికీ అధికారులకు గ్రామపంచాయతీ సిబ్బందికి పంచాయతీ సెక్రెటరీ వార్డ్ నెంబర్ కు అధికారులు. ఒక వైపు తమరు పత్రికా మిత్రులు గ్రామాలలో ఎలాంటి సమస్య ఉన్న నా దృష్టికి తెస్తే రెండు రోజులలో పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీలకు సంభందించిన అధికారులు నిద్రా వస్థలో ఉన్నట్టా మరి ? ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ కార్యదర్శులను నియమిస్తే వారు నిర్వహిస్తున్న విధులు ఏంటి ? గ్రామాలలో నెలకొన్న సమస్యలను మండల అధికారులే పరిష్కరిస్తే గ్రామ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు నిర్వహిస్తున్న విధులు ఏంటని గ్రామ ప్రజలు అంటున్నారు. ఇకనైనా స్పందించి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు పేర్కొన్నారు…