Wednesday , July 24 2024

దౌల్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (మే10)

కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం పరిధిలో గల గోకా పసల్వాద్, దేవరపసల్వా ద్,సుల్తాన్పూర్, బలంపేట్, తిమ్మారెడ్డిపల్లి, తిరుమలపూర్, గ్రామాలలో బైక్ ర్యాలీతోపాటు ఇంటింటి ప్రచారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా వివిధ నాయకులు మాట్లాడుతూ మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడు చల్ల వంశిచంద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మద్దతు తెలుపుతూ మండలంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి చల్ల వంశి చంద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ రెడ్డి, మండల అధ్యక్షుడువెంకట్రావు, బి వెంకట్ రెడ్డి. రెడ్డి శ్రీను, భీమ్ రెడ్డి , గోపాల్ , షకీల్,మొగలప్ప, మండల్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు మోహన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగం వీరన్న, మాజీ ఎంపిటిసి కూర వెంకట రాములు మాజీ జెడ్పిటిసి మోహన్ రెడ్డి, ఎంపిటిసి మోతిలాల్ నాయక్, చందర్ నాయక్ ,రాజు నాయక్,రమేష్ నాయక్, మాజీ సర్పంచ్ నరేందర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.