ఇసుక ట్రాక్టర్, బైక్ ఢీ.. వ్యక్తి పరిస్థితి విషమం..
తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఫిబ్రవరి 28)
నారాయణ పేట జిల్లా కోస్గిలో రోడ్డుప్రమాదం సంభవించింది. ఇసుక ట్రాక్టర్ బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యక్తి పరిస్థితి విషమంగా మారిన సంఘటన కోస్గి మండల కేంద్రంలో ఈ రోజు (బుధవారం) సాయంత్రం 06:40 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
కోస్గి మండలం సంపల్లి గ్రామానికి చెందిన మైబప్ప ఈ రోజు సాయంత్రం 6:30 ప్రాంతంలో కోస్గి మండల కేంద్రానికి ద్విచక్రవాహనం పై వెళ్తున్న క్రమంలో అటువైపు నుండి అత్యంత వేగంతో వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న మైబప్ప తీవ్ర గాయాల పాలయ్యాడు. అది గమనించిన స్థానికులు వెంటనే 108 కి ఫోన్ చేయటం జరిగింది.ఇలాంటి ఘటనలు కోస్గి మండలంలో తరచూ జరుగుతున్నప్పటికీ ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో అధికారులు మాత్రం పూర్తిగా వైఫల్యం చెందారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. కనీసం ఎలాంటి ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లు ఇసుక ట్రాక్టర్లను డ్రైవింగ్ చేస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావటం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారా వేచి చూడాలి.