Tuesday , July 16 2024

దొంగ హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా ప్రతినిధి 4

నవపేట్ మండల్ పులుసు మామిడి గ్రామం శనివారం నాడు వికారాబాద్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ మండలం లోని పులుసు మామిడి గ్రామం లో తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రచారం నిర్వహించారు మరియు గ్రామ శివారులో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి మాట్లాడారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల్లో గెలిచేందుకు తొలి కేబినెట్ సమావేశంలోనే హామీలని అమలు చేస్తామని దొంగ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను తెలివిగా మోసం చెయ్యాలని చూసిందన్నారు. అసలు వారిచ్చిన హామీల అమలుకి ఎంత డబ్బు కావాలి, ప్రభుత్వం ఎలా సమీకరించాలి అనే విషయాలపై వారికి స్పష్టత లేదన్నారు. ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ అబద్ధాలు చెప్పిందని, ఇప్పుడు ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకునే పరిస్థితి లేదన్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ధి చెప్తారన్నారు. . వచ్చే ఎంపీ ఎన్నికలలో రైతులు, ప్రజల పక్షాన ఉండే కారు గుర్తుకు ఓటు వేసి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు
ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కమాల్ రెడ్డీ, మాజీ రైతుబందు అద్యక్షులు రాంరెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి,మైనార్టీ అద్యక్షులు ఘయజ్, వైస్ ప్రెసిడెంట్ శివ కుమార్, సత్తయ్య, యువ నాయకులు అశోక్, సోషల్ మీడియా అద్యక్షులు అనిల్, మహిపాల్ తదితర నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు…