Wednesday , September 18 2024

బిజెపి ని ఓడించండి..!కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిరంజిత్ రెడ్డి ని గెలిపించాలని..సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య పిలుపు

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి 4

దోమ : మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికలలో బిజెపి,బిఆరెస్ పార్టీలను ఓడించి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజీత్ రెడ్డిని గెలిపించాలని నేడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దోమ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య మాట్లాడుతూ… పదేండ్లు మోదీ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎమర్జెన్సీ ని మించిన నియంతృత్వ పోకడాలు పోతున్నది. రాజ్యాంగ మౌలిక సూత్రాలులైన ప్రజాస్వామ్యం,లౌకిక విలువ పై దాడి చేస్తున్నది.మతం పేరుతో రాముడు పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. మత ప్రాతిపదికన ప్రజలను విభజించి, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు . ఈసారి మళ్లీ బిజెపి అధికారంలోనికి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి మత రాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది. కుల వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా కుల వివక్షతను కొనసాగించడానికి పునుకుంటున్నారు. ఈ చర్యల వల్ల ప్రజల శాంతియుత,సహజీవనానికి దేశ సమైక్యతకు శ్రామికుల ఐక్యతకు ప్రమాదకరం. ఈ ఎన్నికలలో మోడీని గద్దె దించడం ద్వారా దేశాన్ని కాపాడుకుందాం ప్రజా సమస్యల పరిష్కారంకోసం జరుగుతున్న అన్ని పోరాటలకు సిపిఎం అండగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యం లౌకిక విలువల పరిరక్షణ కొరకు సిపిఎం నికరంగా పోరాడుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులలో దాన్ని పట్టిపీడిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపడం కొరకు వామపక్షాల బలం మాత్రమే చాలదు. దేశంలో లౌకిక శక్తులన్నీ ఇందుకోసం పోనుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే లక్ష్యంతో ఉన్న ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమి పేరుతో ఒక సమూహంగా ఏర్పాడింది. అందులో ప్రధాన పాత్ర వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ తరుపున చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని సిపిఎం పరిగి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎహ్.సత్యయ్య,పి.రఘురామ్, సీఎహ్, సత్యయ్య,శేఖర్, ప్రశాంత్, ప్రభు,రాంచంద్రయ్య,కృష్ణ,శ్రీను, సాయిబాబు, ప్రభు తదితరులు పాల్గొన్నారు…