తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా ప్రతినిధి 4
దారులు మండల్ ముకుంద గ్రామంలో స్కాంలు చేసే కాంగ్రెస్ వద్దు స్కిములు ఇచ్చే బిజేపి ప్రభుత్వమే మనకు ముద్దు
పదవున్నా లేకున్నా ప్రజల మనిషి కొండా విశ్వేశ్వర్ రెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించుకుందాం
శనివారం నాడు ధారూర్ మండలము కుక్కింద, అల్లీపూర్, హరిదాసుపల్లి, చింతకుంట, గట్టెపల్లి, రుద్రారం గ్రామాలలో బిజేపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు
కరోనా కష్టకాలంలో ప్రపంచ దేశాలకు పెద్దన్నగా నిలిచి భారతదేశంలో ప్రతి పౌరుడికి కరోనా టీకాను అందించి దేశ పౌరుల భద్రతకు భరోసాగా నిలిచిన మోడీ సర్కార్ మరోసారి భారతదేశంలో కొలువుదీరి మరింత దేశాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు.
సేవ తప్ప స్వార్థం తెలియని నాయకుడు కోట్ పల్లి ప్రాజెక్టుతో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించిన కల్మషం లేని నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ బిజెపి పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి చేవెళ్ల పార్లమెంటు ఎంపీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకుందామన్నారు
అనంతరం కుక్కింద గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు జె బీరప్ప, మహేష్ వారి అనుచరులు బిజెపి పార్టీలో చేరారు
కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనయుడు విశ్వజిత్ రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు వివేకానంద రెడ్డి, సీనియర్ నాయకులు పాండు గౌడ్, అధికార ప్రతినిధి రాజేందర్ గౌడ్, పిఎస్ సిఎస్ వైస్ చైర్మన్ రాజు నాయక్, మహిళా మోర్చా అధ్యక్షురాలు యాస్కి శిరీష, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, మాధవి, మంజుల జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణ, రామకృష్ణారెడ్డి, అనిల్ గౌడ్, మణికంఠ రెడ్డి, రాఘవేందర్ గౌడ్ తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…