తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా ప్రతినిధి 4
సిపిఐ (యం-ఐ) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై మహేందర్ సిపిఐ (యం- ఐ) న్యూడెమోక్రసీ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది
ఈసందర్భంగా సిపిఐ (యం -ఐ) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై మహేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఫాసిస్ట్ బీజేపీ ని ఓడించండి – ఇండియా కూటమిని గెలిపించండిసిపిఐ (యం -ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై మహేందర్సిపిఐ (యం ఐ) న్యూడెమోక్రసీ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది.
ఈసందర్భంగా సిపిఐ (యం ఐ) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై మహేందర్ మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వన్ని ఓడించాలని అన్నారు.
బిజెపి గత పది సంవత్సరాల కాలంలో ప్రజలు చెమటోర్చి సంపాదించిన డబ్బును జిఎస్టి పేరుతో పన్నుల రూపం లో వచ్చిన సంపదను కొద్ది మంది పెట్టుబడుదారులకు కట్టబెడుతూ , బడా పెట్టుబడిదారులకు వేలకోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు రద్దు చేశారని, ప్రభుత్వ సెక్టార్ కి సంబంధించిన సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని , ప్రైవేటీకరణ లో రిజర్వేషన్లు రద్దు అవుతాయని కింది స్థాయి ప్రజలకు ఉద్యోగ అవకాశాల్లేకుండా పోతాయని అన్నారు, పార్లమెంట్లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో బిజెపి ప్రభుత్వం ఉందని , మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతు పార్లమెంట్లో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, స్వాతంత్ర సమరయోధులకు మరియు ఇతర వ్యక్తులకు మతం రంగు పుస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. దేశంలో నిరుద్యోగము, అధిక ధరలు పెరిగిపోయాయని ,రైతు,కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి సంక్షోభంలో కి నెట్టివేశారని కావున పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వన్ని ఓడించాలని పిలుపునిచ్చారు
ఈ సమావేశం లో సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసి జిల్లా నాయకులు శ్రీనివాస్, రాములు, శ్రీకాంత్, గోపాల్ పాల్గొన్నారు.
...ఇట్లు...
వై మహేందర్
సిపిఐ (మాల్ ) న్యూడెమోక్రసీ వికారాబాద్ జిల్లా కమిటీ.
.