Tuesday , July 16 2024

శ్రీరాముని జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి..…మామిళ్ళ భీమయ్య.

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి15

తూము మండలం గ్రామంలో శ్రీరాముని జీవితాన్ని మానవాళి ఆదర్శంగా తీసుకోవాలని, ప్రతి ఒక్కరు ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలని మామిళ్ల భీమయ్య అన్నారు.
దొంగ మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామంలో జరుగుతున్న సంపూర్ణ రామాయణం వీధి నాటకానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేటి సమాజంలో శ్రీరాముడి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ధర్మ మార్గం ఎంచుకోవాలని అన్నారు. పురాణ ఇతిహాస గాధలు మన యొక్క సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు. నేటి కంప్యూటర్ యుగంలో ఇలాంటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వీధి నాటకాన్ని ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్న కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు, నాటక బృందం సభ్యులు జంగయ్య నారాయణ, అనంతయ్య, సత్యనారాయణ, ఆంజనేయులు, లక్ష్మయ్య, మల్లయ్య, గోపాల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…