Tuesday , July 16 2024

ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి:మాజీ మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ అబద్ధపు మాటలు నమ్మవద్దు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

నెల రోజులు కష్టపడి శ్రీనివాస్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలి:మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావ్

కొడంగల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై నిజాలు రాస్తున్న జర్నలిస్టులను బెదిరించడం సిగ్గుచేటు:మాజీ మంత్రి హరీష్ రావు

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఏప్రిల్ 15)

కొడంగల్ నియోజకవర్గం కొస్గి మున్సిపల్ కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్ పంక్షన్ హాల్లో. బిఆర్ఎస్ కొడంగల్ నియోజకవర్గ మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.కొడంగల్ నియోజకవర్గం కార్యకర్తల సన్నాహక సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు “తన్నీరు హరీష్ రావు, మరియు మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నారాయణపేట జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేందర్ రెడ్డి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు.పార్లమెంట్ ఎన్నిక చాలా ముఖ్యం కాబట్టి ఎంపీగా మన్నే శ్రీనివాస్ రెడ్డి గెలవడం ఎంతో ముఖ్యం అని మాజీ ఎమ్మేల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ నిజ స్వరూపం నాలుగు నెలల్లో బయట పడిందిని అన్నారు.ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచింది అన్నారు.బిజెపి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందని ఆరోపించారు.పేదల నడ్డి విరిచింది అన్నారు.పేదరికం పెరిగింది, ఆకలి పెరిగింది అన్నారు.పదేళ్ల బిజెపి పాలనలో బాగుపడ్డ వారు ఎవరు లేరన్నారు.బీజేపీ ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ కళాశాల ఇస్తే, ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు అన్నారు.కేసీఆర్ మాత్రం మన పిల్లలు మన జిల్లాలో చదవాలని నారాయణ పేటలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు.కెసిఆర్ పాలించిననన్ని రోజులు ఏ ఒక్కరూ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకు రాలేదు.ఇప్పుడు నీటి కష్టాలు, బిందెలు కనిపిస్తున్నాయి హరీశ్ రావు ఆరోపించారు.హామీలు అమలు చేయని కాంగ్రెస్ ఇంటి వద్దకు వస్తె,ఓటు వెయ్యవద్దు అన్నారు. బీ అర్ యస్ ఎంపీలను గెలిపించండి. వాళ్ళను ప్రశ్నించే బాధ్యత మేము తీసుకుంటాం అన్నారు.నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ.నిరుద్యోగ భృతి అని మాట తప్పిందని ఆరోపించారు.చదువుకొనే కాలేజి బాలికలకు స్కూటీ ఇస్తా అని మాట తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం.రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం…
2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడంలో మోసంచేసింది బీజేపీ ప్రభుత్వం,గ్యాస్ సిలిండర్ వెయ్యి పెంచి ఎలక్షన్ వచ్చేసరికి వంద దించుతారా…ఇక్కడ పోటీ చేసే బిజెపి,కాంగ్రెస్ అభ్యర్థుల మాటలకు హద్దు అదుపు లేదు….ఇక్కడ పోటీ చేసే మన అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి స్థానిక వ్యక్తి మన మహబూబ్ నగర్ ఇక్కడే ఇల్లు ఉంది ఇక్కడే కుటుంబం ఉంది. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.నిజం ఏంటంటే బిజెపి,కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీ ఆర్ ఎస్ ను ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి అన్నారు.అబద్ధాలు ప్రచారం చేసి గెలవాలనుకునే వారికి తగిన బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు ప్రజలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.