తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఏప్రిల్ 14)
- మండల అధ్యక్షుడిగా నాగభూషణం,
- ఉపాధ్యక్షులు,దూది వీరప్ప, జాకా ప్రవీణ్
- యువజన అధ్యక్షుడిగా రాకేష్
దౌల్తాబాద్ ఏప్రిల్ 14, (జనం సాక్షి):
దౌల్తాబాద్ మండల వీరశైవ సమాజం నూతన మండల కమిటీ, యువజన కమిటీ లను ఆదివారం రోజు దౌల్తాబాద్ మండలంలోని గుండెపల్లి వీరభద్రేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో వీరశైవ సమాజ కమిటీ లను నిర్వహించారు. ఈ సందర్భంగా వీరశైవులందరి సమక్షంలో వీరశైవ సమాజం మండల గౌరవ అధ్యక్షుడిగా జంగం వీరన్న దౌల్తాబాద్ ను , అధ్యక్షుడిగా మునగల నాగభూషణం సాల్లింపూర్ ను , ఉప అధ్యక్షులు, దూది వీరప్ప, జక ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి వీరేందర్, కోశాధికారి దేవేందర్ యువజన గౌరవ అధ్యక్షుడిగా జంగం శాంత్ కుమార్,అధ్యక్షుడి గా రాకేష్ అల్లాపూర్, ఉప అధ్యక్షులు, వీరేష్, నవీన్,ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దౌల్తాబాద్ మండల వీరశైవ సమాజ నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మండలంలోని వీరశైవ సమాజానికి సంబంధించిన ప్రతి ఒకరికి ఎలాంటి సమస్యలు ఎదురైనా తమకు తమ సమాజం ఉందని సమాజం నుండి వీర శైవ సభ్యులకు ఎలాంటి సమస్యలు వచ్చిన ముందుండి పరిష్కరిస్తామన్నారు. సమాజంలోనూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సమానత్వంగా చూసుకొని సమాజం పట్ల ప్రతి ఒక్కరికి సహాయశక్తులుగా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల సమాజం సభ్యులు కోడంగల్ మండల సమాజం సభ్యులు దౌల్తాబాద్ మండల సమాజ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.