Wednesday , July 24 2024

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా బావాజీ జాతర వాల్ పోస్టర్ విడుదల

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఏప్రిల్ 13)

నారాయణ పేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం తిమ్మరెడ్డి గ్రామం లో జరిగే అతి పెద్ద గిరిజన జాతర వాల్ పోస్టర్ ను ఈ రోజు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి శ్రీ ఏనుమల రేవంత్ రెడ్డి నివాసం లో ఈ నెల 22, 23,24,25 తేదీలలో జరిగే ఆదివాసి గిరిజన లంబాడా/బంజారాల ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ శ్రీ గురులోకామాసంద్ ప్రభు దేవస్థానం (మజీ ) బావాజీ జాతర వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వంశస్తులు జాతరకు ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బావాజీ గోపాల్ నాయక్, తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ జేఏసీ చైర్మన్ బావాజీ రవి నాయక్, మద్దూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుల్ల నర్సిములు, అల్ ఇండియా బంజార సేవా సంగం నారాయణపేట జిల్లా అధ్యక్షులు అనిల్ నాయక్, రాథోడ్ నర్సింగ్ నాయక్, బావాజీ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు*