తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఏప్రిల్ 11)
అన్నది ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది ముస్లింలు పవిత్ర ఉపవాసాలతో గడిపే రంజాన్ నెలకు ముగింపు రోజు.ఈ మతపరమైన పండుగ ముస్లింలు ఉపవాసం ఉండడానికి వీల్లేని షవ్వల్ మాసంలో మొదటి రోజు, అంతేకాక ఏకైక రోజు కూడా. 29 లేక 30 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసాలతో గడిపే రంజాన్ నెల ముగింపుగా దీన్ని జరుపుకుంటారు. దాంతో ఈద్ షవ్వల్ మాసం తొలిరోజు అవుతుంది. చాంద్రమాన హిజ్రీ నెల తేదీలు స్థానికంగా చంద్రోదయంపై ఆధారపడివుండడంతో, స్థానిక మతాధిపతులు నెలవంక కనిపించడంపై ఈ పండుగను ప్రకటిస్తారు. దాంతో ఈద్-ఉల్-ఫితర్ ప్రాంతాలవారీగా వేర్వేరు రోజుల్లో జరుపుకుంటూంటారు.
రంజాన్ చివరిరోజు వరకూ ఉపవాసాలు చేయాలనీ, ఈద్ ప్రార్థనలు నిర్వహించేలోపుగా జకాత్ అల్-ఫితర్‌గా పేర్కొనే దానధర్మాలు చేయాలని అల్లా తమను ఖురాన్ ద్వారా శాసించాడని ముస్లిములు నమ్ముతారు.[3]