Thursday , November 7 2024

,• అశోక్ చేసిన రామ మందిరం నమోనకు ప్రపంచ స్థాయి గుర్తింపు..—ప్రెస్టిజియాస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు లో చోటు..

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఏప్రిల్ 10)

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలో యాంకి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్. సున్నపు అశోక్ తను చిత్రకాళ సూక్ష్మ చిత్రకళలో సిద్ద హస్తుడు. తన కళా నైపుణ్యనికి మరో అరుదైన ఘనతను సాధించారు. ఇటీవల అయోధ్య లో ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో 2000 ఐస్ క్రీమ్ పుల్లలతో రోజుకు గంట చొప్పున మొత్తం 20 రోజుల వ్యవాదిలో రామ మందిరం రూపకల్పన చేసి తన కళా భక్తిని చాటిన విషయం అందరికి తెలిసిందే ఇతడు ఐస్ క్రీమ్ పుల్లలు సోప్ప బెండ్లు టుత్ పుల్లలతో మన దేశం లో ప్రసిద్ధిగాంచిన పలు చారిత్రత్మకమైనటువంటి మందిరాలు అద్భుత కట్టడాలను తయారు చేస్తూ తన ప్రతిభ ను చాటుతున్నారు ఈ సందర్బంగా అశోక్ తయరు చేసిన మందిరం పై “ప్రెస్టిజియాస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్” లో స్థానం లభించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ప్రెస్టిజియస్ వరల్డ్ రికార్డు సంస్థ ప్రధాన కార్యాలయం న్యూడిల్లి వారు వివిధ సామాజిక రంగాలలో ప్రతిభను కనిపరిస్తున్న వ్యక్తులను గుర్తించి రికార్డులతో పట్టం కడతారు. నేపథ్యంలో అశోక్ తయారు చేసిన అయోధ్య రామ మందిరం నమోన పై వరల్డ్ రికార్డ్ గా పరిగణలోకి తీసుకోని పౌండర్ సీఈఓ హర్షిత్ బాజ్ పాయ్ గారు ప్రెస్టిజియాస్ వరల్డ్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని ఆన్ లైన్ వేదికలో అందించారు అని అశోక్ తెలిపారు. అశోక్ కి ఈ ఘనత దక్కినందుకు తన తల్లి దండ్రులు. బంధువులు. స్నేహితులు.. గ్రామస్థులు హర్ష వ్యక్తం చేశారు..