తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి ( ఏప్రిల్ 10)
… నారాయణపేట సింగారం గ్రామంలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత, 8.85 క్వింటాళ్ళు, వాటి విలువ 8,85,000/- రూ.
నకిలీ పత్తి విత్తనాలు అమ్మే వారి పై పిడి యాక్ట్ కేసులు నమోదు చేయబడతాయి.
… నకిలీ విత్తనాలు అమ్మేవారి పట్ల రైతుల అప్రమత్తంగా ఉండాలి.
నారాయణపేట జిల్లాలో నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు అమ్మే వారిపై ఉక్కు పాదం మోపుతామని జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… నారాయణపేట మండలం సింగారం గ్రామంలో పూజారి మల్లప్ప ఇంట్లో దాదాపు
16 బ్యాగులలో ఎనిమిది క్వింటాళ్ల నకిలీ హెచ్ టి కాటన్ విత్తనాలను టాస్క్ ఫోర్స్, లోకల్ పోలీసులు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది.
ఇవి కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా గుర్మిత్కల్ తాలూకా మల్లాపూర్ గ్రామానికి చెందిన జాజాపురం నరసప్ప అనే వ్యక్తి నకిలీ పత్తి విత్తనాలను రైచూర్లోని శక్తి నగర్ కు చెందిన బ్రహ్మయ్య కాటన్ మిల్ వద్ద తక్కువ
రేటుకు దాదాపు
09 క్వింటాళ్ల విత్తనాలను కొనుగోలు చేసి బొలెరో ఆటోలో తీసుకువచ్చి సింగారం గ్రామంలో తన మామ పూజారి మల్లప్ప ఇంట్లో నిల్వ చేయడం జరిగింది. అందులో నుండి ఒక క్వింటల్ నకిలీ పత్తి విత్తనాలను ఉట్కూరు మండలం నిడుగుర్తికి చెందిన కురువ బుగ్గప్పకు అమ్మినాడు నిన్న సాయంత్రం ఇట్టి విత్తనాలను నరసప్ప వేరే వ్యక్తులతో అమ్మడానికి ఇంటి వద్ద ఉండగా సంయుక్త దాడిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత నిడుగుర్తి గ్రామానికి వెళ్లి కురువ బుగ్గప్ప వద్ద నుండి దాదాపు 85 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోని నేరస్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మొత్తం నకిలీ విత్తనాలు 8 క్వింటాళ్ల 85 కిలోలు వాటి విలువ 8,85,000/రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. నకిలీ విత్తనాలను పట్టుకోవడంలో బాగా పనిచేసిన పోలీసు, అగ్రికల్చర్ అధికారులను ఎస్పీ అభినందించి త్వరలో రివార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
రైతులు ఆరుగాలం కష్టపడి వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తుంటారు అలాంటి రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో నకిలీ విత్తనాల రిపీటెడ్ గా కేసులు నమోదు అయితే అలాంటి వారిపై పీడియాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. రానున్న వర్షాకాలంలో రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లైసెన్స్ కలిగిన వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి రసీదులు తప్పకుండా తీసుకోవాలని అలాగే వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు సరఫరా చేసిన, విక్రయిస్తున్నట్లు తెలిస్తే జిల్లా పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐలు శివ శంకర్, రామ్ లాల్, ఎస్సై వెంకటేశ్వర్లు, అగ్రికల్చర్ అధికారి శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.