- అశోక్ ని గౌరవ డాక్టరేట్ తో సత్కరించిన మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డు..!!
— గ్రామీణ ప్రాంత యువకుడి కళా సేవ..
— కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుండి ప్రశంసలు..
తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఫిబ్రవరి 25)
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం లోని యాంకి గ్రామ సామాన్య కుటుంబానికి చెందిన సున్నపు ఆశప్ప- నర్సమ్మ దంపతులకు జన్మించిన కళాకారుడు డాక్టర్.సున్నపు అశోక్. చిత్రకారుడిగా సూక్ష్మచిత్రకళాకరుడిగా విభిన్నమైన కళ లో దిట్ట. కడుపేదరికాన్ని మోస్తూ కూలీ పనులు చేసుకుంటూ తల్లి తండ్రులకు చేదోడు వాడొదిగా నిలుస్తున్న అశోక్. పేదరికం బాల్యంలోని చదువుకు చరమగీతం పాడేలా చేసింది. కుటుంబ భారం ఎన్నో కష్టాల పాలు చేసింది. పెన్సిల్ పేపర్ రంగులు చాక్ పీస్లు చింత గింజలు రావి ఆకులు తో చేసిన సాహసం మాత్రం ఆ మట్టి మనిషిని చెయ్యి తిరిగిన చిత్రకారుడిగా చేసింది. కళా తనకు కడుపు నింపలేకపోయినా తనకు కళా పై వున్న అభిరుచిని మాత్రం ఏమాత్రం వదులుకోలేకపోతున్నాడు అతడు ఉన్నత చదువులు చదవలేకపోయినా అతడి నుండి జాలువారిన చిత్రాలు. సూక్మ కళాకృతులు అద్భుతాలుగా కళ్లకు కడుతున్నాయి. ఇంటర్ పూర్తి చేసి డ్రాయింగ్ టీచర్ కోర్స్ పూర్తి చేసుకున్నారు ఎప్పటికైనా డ్రాయింగ్ టీచర్ కావడమే తన లక్ష్యం అంటున్నాడు చదువుకున్నది తక్కువే అయిన ఆర్థికంగా వెనకడుగు వేస్తూ చిత్రకళ లో ముందడుగు వేస్తున్నారు. కళా పరిమనికి గాను సంస్థలు రికార్డులు అవార్డులతో తన ప్రతిభకు పట్టం కట్టాయి గతం లో గ్లోబల్ నేషన్ ఓపెన్ యూనివర్సిటీ (USA ) నుండి గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నరు తాజాగా మరో మరు గౌరవ డాక్టరేట్ ను సాధించి పలువురికి ఆదర్శం గా నిలుస్తున్న యువ కిషోరం.. మ్యాజిక్ బుక్ అఫ్ రికార్డ్ కై గతంలో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. చిన్ననాటి నుండి నేటి వరకు చిత్రకళ రంగంలో ఆయన కృషిని గుర్తించి ఇప్పటి వరకు అందుకున్న పలు అవార్డ్ లను ప్రత్యేక పరిగణలోకి తీసుకుని మ్యాజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ హర్యాణ అనుబంధ సంస్థ. మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్ హర్యాణ వారు తనపై రికార్డును నమోదు చేసుకుని అశోక్ నీ గౌరవ డాక్టరేట్ అవార్డ్ తో సత్కరించగా ఈ మెరకు నారాయణ పేట జిల్లా కేంద్రం లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సంస్కృతిక శాఖ మహత్యులు శ్రీ గంగా పురం కిషన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా అశోక్ కలిశారు. అక్కడ జరిగిన ఓ సమావేశంలో కిషన్ రెడ్డి చేతులమీదుగా గౌరవ డాక్టరేట్ అవార్డ్ నీ అశోక్ అందుకున్నారు. మంత్రి అశోక్ ని అభినందించి తన వివరాలను అరతియగా జిల్లా అధ్యక్షులు పగడాకుల శ్రీనివాసులు మంత్రి కిషన్ రెడ్డి తో తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు తన చిత్రకళ నైపుణ్యానికి తగిన గుర్తింపు నివ్వాలని కేంద్ర ప్రభుత్వము తరుపున అందించే కళాకారుల అవార్డు లతో సత్కరించే తనను ఆదుకోవాలని అతను ఆర్థికంగా నిల దొక్కుకునేల ఉపాధి అవకాశాలు కల్పించాలని విన్నవించాగా మంత్రి స్పందించి తప్పకుండా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చినట్లు అశోక్ తెలిపాడు ఈ అవార్డ్ అశోక్ కి వరించినందుకు తన తల్లి దండ్రులు అర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు సమాజానికి చాలా అవసరమని ప్రభుత్వ ఉన్నత అధికారులు అశోక్ చిత్రకళ పై దృష్టి సారించి తనకు తగిన గుర్తింపు ఇచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు తోటి మిత్రులు విద్య వంతులు పలువు కోరుకుంటున్నారు.