Sunday , May 26 2024

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు – జిల్లా ఎస్పీ కోటిరెడ్డి,.

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఏప్రిల్ 08)

జిల్లాలోని ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఉగాది పండగను ప్రజలు ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని, ఈ నూతన సంవత్సరం అందరికీ కొత్త ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని ఉజ్వల భవిష్యత్తును అందించాలని తెలిపినారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి శ్రేయస్సు సామరస్యం సంతోషాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.