తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఫిబ్రవరి 25)
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొమ్మరేస్ పేట మండలంలో లగచర్ల గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ విజయ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బోమ్మరస్ పేట పట్టణ కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా కలప ను అక్రమంగా తరలిస్తున్న డీసీఎం టి ఎస్ 12 యు సి 8278 నీ పట్టుకోనీ డీసీఎం నడుపుతున్న వ్యక్తి ఎండీ నసీర్ ఖాన్ పై కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రౌఫ్ తెలిపారు.