Monday , September 16 2024

వికారాబాద్ జిల్లా: తాండూరులో కర్ణాటక తెలంగాణ పోలీస్ సమావేశం

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఫిబ్రవరి 22)

_ కర్ణాటక రాష్ట్రం చించొల్లి సబ్ డివిజన్ అధికారులతో చించొలికి అనుసంధానంగా ఉన్న తెలంగాణ పోలీస్ అధికారులు సమావేశం నిర్వహించారు.సమావేశంలో దొంగతనాలు రాబరీలు, డికాయిటిళ్లు,తప్పిపోయిన మరియు గుర్తించబడని మర్డర్ల గురించి గంజాయి నేరస్తుల ప్రవర్తన పై రెండు ప్రాంతాలలో జరిగే నేరాలపై నేర నియంత్రణ గురించి చర్చించడం జరిగింది_.సమావేశం కు కర్ణాటక రాష్ట్రం చించోలి డిఎస్పి మరియు ఇతర అధికారులు తెలంగాణ ప్రాంత తాండూర్ డిఎస్పి బాల కృష్ణా రెడ్డి, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి,తాండూర్ రూరల్ సీఐ అశోక్ గౌడ్,మరియు ఇతర అధికారులు హాజరు అవడం జరిగింది.