తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఫిబ్రవరి 07)
దౌల్తాబాద్ మండల నీటూరు గ్రామంలో బెల్ట్ షాపులపై రైడ్ నిర్వహించిన దౌల్తాబాద్ పోలీసులు సురేష్ అనే వ్యక్తి దగ్గర నిల్వ ఉన్న 12 లీటర్ల మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీశైలం యాదవ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.