Tuesday , July 16 2024

ప్రభుత్వ పథకాల అమలులో 5 శాతం వికలాంగులకు కేటాయించాలి

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా ప్రతినిధి 04

వికలాంగుల ఉద్యోగ నియామకాల ల్లో శరీరక వికలాంగుల రోస్టర్ 10లోపు తగ్గించాలివికలాంగుల నిధులు ప్రభుత్వ పథకాల ప్రచారానికా
NPRD జిల్లా సదస్సులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కొమరం బీం ఆసిఫాబాద్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో ఈ రోజు వికలాంగుల చట్టాలు… సంక్షేమ పథకాలు అంశం పై జిల్లా సదస్సు బాలభారతి స్కూల్ ఆవరణలో జిల్లా గౌరవ అధ్యక్షులు ముంజం ఆనంద్ కుమార్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు ముంజం ఆనంద్ కుమార్
హజరై మాట్లాడుతూ
దేశవ్యాప్తంగా వికలాంగుల కోసం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో అక్రమాలు ఉన్నాయని, ఆర్థిక నిర్వహణ సక్రమంగా అమలు చేయడం లేదని , నిధుల పర్యవేక్షణ చేయడంలో వికలాంగుల సంక్షేమ శాఖ విఫలం చెందుతుందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ వెల్లడించింది .ఆర్థిక సంవత్సరం చివర్లో నిధులు విడుదల చేయడం ద్వారా లబ్ధిదారులకు అందకుండా పోతున్నాయి. వికలాంగుల పెన్షన్ నిధులను ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి అనేక పథకాల ప్రచారానికి వినియోగిస్తున్నారు. జమ్మూకాశ్మీర్, గోవా, బీహార్ రాష్ట్రాలలో 2.83 కోట్లు ప్రభుత్వ ప్రచారం కోసం వినియోగించారని కాగ్ నివేదిక వెల్లడించింది.ప్రపంచ జనాభాలో 16% మంది వికలాంగులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది .దేశంలో 10-15 శాతం మంది వికలాంగులు ఉన్నారని అంచనా.పాలకులు అనుసరిస్తున్న విధానాల మూలంగా వికలాంగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పర్సన్ విత్ డిజేబులిటీ 2021- 22 వార్షిక రిపోర్ట్ ప్రకారం 67,09,894 మందికి యూడిఐడి కార్డులు జారీ చేసింది.దేశవ్యాప్తంగా 1,74,25,094 మందికి వైకల్య ధ్రువీకరణ పత్రాలు జారీ అయితే 67.09 లక్షల మందికి యూడిఐడి కార్డులు జారీ చేసినారు. పాఠశాలలకు వెళుతున్న వైకల్యం కలిగిన విద్యార్థులను గుర్తించేందుకు ప్రతి ఐదేండ్లకు ఒకసారి సర్వే చేయాలని 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 17( ఏ) పేర్కొందని అన్నారు.కానీ దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి సర్వేలు చేయడం లేదు. గ్రామపంచాయతీ, అంగన్వాడీ, ఆశా వర్కర్ల ద్వారా వికలాంగుల వివరాలను గ్రామ స్థాయిలో సేకరిస్తే వికలాంగుల సమగ్ర సమాచారం సేకరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లెక్కల ప్రకారం 10.48లక్షల మంది వికలాంగులు ఉన్నారు. తెలంగాణ దిశబ్లెడ్ స్టడీ ఇండియా రిపోర్ట్ ప్రకారం 43.02 లక్షల మంది ఒక్కటి కంటే ఎక్కువ వైకల్యాలు కలిగిన వారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 12.2శాతం వికలాంగులున్నారు. రాజకీయ పార్టీలు వికలాంగుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యoగా వ్యవహరిస్తున్నవి.రాష్ట్ర ప్రభుత్వం కులాలకు ఇస్తున్న ప్రాధాన్యత సమాజంలో అత్యంత వెనుకబడిన వికలాంగులకు ఇవ్వడం లేదు. రాజకీయ పార్టీలు సకాలంగుల సంక్షేమం కోసం అనేక కొత్త పథకాలు ప్రకటిస్తున్నారని కానీ వికలాంగుల కోసం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. పెన్షన్ 6000 పెంపు, ఉచిత విద్యుత్ ప్రయాణ సౌకర్యం, శరీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గించాలని,2016 RPWD చట్టం అమలు కోసం, నామినేటెడ్ పదవులలో రిజర్వేషన్స్ అమలు కోసం అసెంబ్లీలో చట్టం చేయలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రదీప్ మండల్,పి రాజేష్,రాజయ్య, అశోక్ కుమార్, జాకీర్, అశోక్, లక్ష్మి బి, లక్ష్మి, సంతోష్, ప్రమీల, ఉప్పరి వెంకటేష్, సప్తగిరి రెడ్డి, రమేష్, లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు…