Friday , November 15 2024

జిరాయిత్ నగర్ లో పెంపుడు కుక్కల బీభత్సం

ఇదేంటని ప్రశ్నిస్తే గొడవకు దిగుతున్న కుక్కల యజమాని

తెలంగాణ కెరటం ఆర్మూర్ జూన్ 10:
ఆర్మూర్ పట్టణం లో
జిరాయిత్ నగర్ లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయస్సు కలిగిన అభం శుభం తెలియని చిన్నారులను పెంపుడు కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఊరిలో తిరిగే కుక్కలను పెంచుకుంటున్న యజమాని వాటిని బయటకు వదలడం వలన అవి చిన్నారులను దాడి చేశాయి .గతంలో ఇవి అనేక పశువులను కరవడం జరిగింది .కనీసం వాటికి వ్యాక్సినేషన్ టీకాలు కూడా లేవు ఇదేంటని బాధిత కుటుంబం కుక్కల యజమానిని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించినట్లు

చెబుతున్నారు. ప్రమాదకరమైన కుక్కలను జనావాసాల మధ్యన వదలడంతో కాలనీవాసులు భయాందోళనలకు గురి అవుతున్నారు అధికారులు స్పందించి కుక్కల యజమానుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని పెంపుడు కుక్కలను బయటకు వదలద్దని వారు కోరుకుంటున్నారు.