Monday , September 16 2024

వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ ప్రచార వాహనం పై దాడి


రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి నవంబర్:-01

వేములవాడ శివారు నంది కమాన్ శివారు ప్రాంతంలోని ప్రధాన రహదారి వద్ద
వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ ప్రచార వాహనం పై కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రచార రథాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు ప్రచార రథానికి ఉన్న ఫ్లెక్సీ లను చించివేసి డ్రైవర్ పై దాడికి ప్రయత్నించారు డ్రైవర్ సమయ స్ఫూర్తి తో దుండగులు అక్కడినుండి సిరిసిల్ల వైపు పారిపోయారు
ఘటన విషయం తెలుసుకున్న వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకొని, ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే సంఘటన
స్థలానికి వేములవాడ డి.ఎస్.పి నాగేంద్ర చారి, ఎస్సై ప్రశాంత్, పోలీస్ సిబ్బంది చేరుకొని ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు
ఆది శ్రీనివాస్ ప్రచారాన్ని మరియు ఆయన గెలుపును ఓర్వలేకే ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడుతున్నారని ఇలాంటి వారిపై ఎన్నికల కోడ్ నిబంధనలను అనుసరించి కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.