పోటీ లేకుండానే ఏకగ్రీవం గా వైస్ చైర్మెన్ ఎన్నిక?
తెలంగాణ కెరటం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి డిసెంబర్:-22
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ లో రాజకీయం రసవత్తరం గా మారింది ఈనెల ఎనిమిదవ తేదీన
వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ తన పదవికి రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మధు రాజేందర్ తన పదవికి రాజీనామా చేయడంతో
అప్పటినుండి వైస్ చైర్మెన్ సీటు ఖాళీగానే ఉండడం తో వైస్ చైర్మెన్ పదవి కోసం పలువురు కౌన్సిలర్ లు పోటీకి సిద్ధమవ్వగా
ఆ సీటు మీద కన్నేసిన ఓ కౌన్సిలర్ మరో కౌన్సిలర్ భర్త సహాయం తో కొంత మంది కౌన్సిలర్ లకు యాభై వేల రూపాయలు తో పాటు వారు ఎవరికీ సహకరించకుండా బాండ్ పేపర్ పై సంతకం పెట్టించుకున్నట్టు కౌన్సిలర్ లు చెప్పుకొంటున్నారు