Tuesday , July 16 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి;?

తెలంగాణ కెరటం వెల్దుర్తి మండల ప్రతినిధి మే 6:వెల్దుర్తి

మండలంలోని దామరంచ, అక్కంపల్లి, అకింపేట్, గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మండల ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జడ్పిటిసి రమేష్ గౌడ్ ప్రారంభించారు. ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు రైతుల గురించి ఆలోచించి రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఎటువంటి ఆందోళన వద్దని స్థానిక ఎంపీపీ, స్వరూప నరేందర్ రెడ్డి, జడ్పిటిసి రమేష్ గౌడ్ ఆయా గ్రామాల సర్పంచులు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.