Tuesday , July 16 2024

వరి ధాన్యం తరలించడం లేదంటూ రోడ్డెక్కిన రైతన్నలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ కెరటం జూన్:-02

వరి ధాన్యం తరలించడం లేదంటూ కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామ రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి వెంటనే ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల-నిమ్మపల్లి ప్రధాన రహదారి కోనరావుపేట మర్రి జంక్షన్ వద్ద ఎగ్లాస్పూర్ గ్రామ రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు కోనరావుపేట లో తెలంగాణ ఆవిర్బవ దినోత్సవ వేడుకలకు వెళుతున్న ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ ని అడ్డుకొని ధాన్యం కొనుగోళ్ల పై నిలదీశారు