Tuesday , July 16 2024

వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్థల సేకరణ కొరకు వనపర్తి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వనపర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు


తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి జనవరి 3.


వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ కు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం కోసం వినతి పత్రం అందజేయడం జరిగింది ఎంతోకాలంగా వనపర్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది వనపర్తి జిల్లా కావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది కావున వనపర్తి పట్టణ పరిధిలో సుమారు 2 -00 ఎకరాల వరకు స్థలం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్తల లక్కాకుల సతీష్ కౌన్సిలర్స్ బ్రహ్మం సుమిత్ర యాదగిరి లక్ష్మీ రవి యాదవ్ జయసుధ మధు గౌడ్ వెంకటేశ్వర్లు చీర్ల సత్యం విభూతి నారాయణ మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ వనపర్తి పట్టణ ఓబిసి అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ వనపర్తి జిల్లా నాయకులు రామ్ రెడ్డి ఆర్ బి రవి ఈశ్వర్ గౌడ్ నరేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు