Monday , September 16 2024

వనపర్తి డిఎస్పీ గా జే. వెంకటేశ్వర రావు.

జిల్లా ఎస్పీకి పుష్పగుచ్చం అందజేసి బాధ్యతలు స్వీకరించిన డిఎస్పీ

తెలంగాణకెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 16
.

రాష్ట్రంలో సాధారణ బదిలీలలో భాగంగా వనపర్తి డిఎస్పీ T. ఆనంద రెడ్డి బదిలీకావడంతో వనపర్తికి కొత్త డిఎస్పీ గా J. వెంకటేశ్వరరావు బదలీపై నారాయణపేట డి సీ ఆర్ బీ నుండి వనపర్తి కి డిఎస్పీ గా రావడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షిత కె మూర్తి, ఐపీఎస్ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి కలిశారు.
వనపర్తి డిఎస్పీ గాబాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ సమస్య పరిష్కరించే దిశగా హామీ ఇస్తూ బాధితులకు ధైర్యాన్ని కల్పిస్తూ విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎటువంటి పెండెన్సీ లేకుండా చూడాలని, త్వరితగదగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను పూర్తి చేయాలని సూచించారు