Saturday , October 12 2024

సూర్య నమస్కారాలు చేస్తే శక్తి వస్తుంది

యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాగితాల మధు

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి జనవరి 18

ఖిల్లా గణపురం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రథసప్తమి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాగితాల మధు సూర్య నమస్కారాలు చేయించారు. మధు మాట్లాడుతూ ప్రత్యక్ష దైవంగా సూర్యుని ఆరాధిస్తామని అలాగే నిత్య దేవతారాధనలో సూర్యోపాసన, సూర్యారాధన ఎంతో ప్రాచీనమైనది. భగవంతుని కార్యాలైన సృష్టి స్థితి లయలలో స్థితికి ప్రధానమైనటువంటి సూర్యుడు పూజలందుకుంటున్నాడు. సూర్యుడు వర్షానిస్తాడు శరీరానికి కాంతిని ఇస్తాడు. ఎండ ద్వారా తడిని పోగొట్టి అక్కడ పుట్టే వివిధ క్రిమి కీటకాల ద్వారా వచ్చే వ్యాధులను రాకుండా రక్షిస్తాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆర్గ్యమిస్తే చాలు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు.ఉత్తరాయణ పుణ్య కాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు మారే పర్వదినమే రథసప్తమి అని యువశక్తి ఫౌండేషన్ మధు తెలియజేశారు. రథసప్తమి నాటి బ్రాహ్మీ మృహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి ఉండి సూర్య రతాని తలపిస్తాయని ప్రతీతి. ఈరోజు నుంచి సూర్యునికి భూమి దగ్గర అవడం ప్రారంభిస్తుంది. భానుడి శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సూర్యారాధన సూర్య నమస్కారాల వల్ల విజ్ఞానం, సద్భుద్ది,సద్గుణం,మనోబలం, ఆయుషు,దానం, శారీరక బలం కలగడమే గాక అనేక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాగితాల మధు, కళాశాల ప్రిన్సిపాల్ రాధా లెక్చరర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.