Tuesday , July 16 2024

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా కొనసాగుతున్న చేరికలు

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మణిగిళ్ల మాజీ ఎంపిటిసి 100 మంది కార్యకర్తలు నాయకులు

గ్రామాల్లో బీటలు వారుతున్న టిఆర్ఎస్

కాంగ్రెస్ పార్టీ వైపు కదులుతున్న జనం

గ్రామం, పట్టణం అని తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి మే 4

శనివారం పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామం గ్రామ మేరెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు నరసింహారెడ్డితో పాటు టిఆర్ఎస్ పార్టీ కి చెందిన 100 మంది కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.వీరికి నందిహిల్స్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.గత 15 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ లో కొనసాగుతూ నాన్న ఇబ్బందులు ఎదుర్కొన్నామని కేవలం పార్టీలో ఉన్నామే తప్ప పెత్తనం మాత్రం ఇతరులు చేసేవారని వారు వాపోయారు.వారికి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఇకపై మీకు అండగా నేనున్నానని ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని ఆయన వారికి భరోసా కల్పించారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని రానున్న ఎంపీ ఎన్నికలలో డాక్టర్ మల్లురవి కి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మద్దిలేటి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మాండ్ల రాములు, వెంకటయ్య, నరసింహారెడ్డి, వడ్డే వెంకటేష్, బాలపీరు బోడి కృష్ణయ్య, రాములు, తిరుపతయ్య రాఘవేందర్ రవీందర్ లతోపాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.